సుచి లీక్స్‌పై క్లారిటీ ఇచ్చిన సుచి..!

0
70

 Posted May 3, 2017 at 14:58

singer suchitra reveals about on suchileaks tweetsకోలీవుడ్‌లో దాదాపు రెండు నెలల క్రితం సుచి లీక్స్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రముఖ సింగర్‌ అయిన సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ నుండి తమిళ స్టార్స్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో అంతా గందరగోళం మొదలైంది. అంతకు ముందు ధనుష్‌ మరియు ఆయన సన్నిహితుడు అనిరుధ్‌లు తనను రేప్‌ చేసేందుకు ప్రయత్నించారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె చేసిన ఆరోపణలు ఆమె భర్త మొదట కొట్టి పారేశాడు. ఆ తర్వాత అవి తన భార్య చేసినవే అని, ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా లేదంటూ వీడియో మెసేజ్‌లో చెప్పుకొచ్చాడు.

తమిళనాట అంత గందరగోళంకు కారణం అయిన సుచి తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆ ట్వీట్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్‌ అకౌంట్‌ను అప్పుడు ఒక సంస్థ హ్యాక్‌ చేసిందని, ఆ సంస్థ నుండే సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు వచ్చాయంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ సంఘటనతో బాధ పడ్డ ప్రతి ఒక్కరికి తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే సుచిలీక్స్‌ చేసింది ఆమెనని, ఇప్పుడు ఆమె నాటకం ఆడుతుందని, ఆ లీక్‌లకు తన భార్య కారణమని, ఆమె మానసికంగా చెడ్డ పరిస్థితుల్లో ఉందని ఆమె భర్త స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సుచి వచ్చి తనకు ఆ ట్వీట్స్‌తో సంబంధం లేదంటే నమ్మేవారు ఎవరు లేరని కొందర తమిళ సినీ ప్రముఖులు అంటున్నారు. ఆ సంఘటన వల్ల ఇబ్బంది పడ్డ సెలబ్రెటీలు ఇప్పుడేం అంటారు అనేది ఆసక్తికర అంశం.