సింగం రివ్యూ

0
58

Posted February 9, 2017

singham reviewచిత్రం: సింగం-3  
తారాగణం: సూర్య, అనుష్క,  శ్రుతిహాసన్‌, రాధిక,  క్రిష్‌, సూరి, నీతూచంద్ర 
సంగీతం: హారిస్‌ జయరాజ్‌ 
ఛాయాగ్రహణం: ప్రియన్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెల కంటి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌ 
రచన, దర్శకత్వం: హరి 
సమర్పణ: స్డూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌

విడుదల తేదీ: 9-2-17

గత మూడు నెలలుగా కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులను ఊరిస్తున్న సినిమా సింగం-3.  హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌ లో సింగం సిరీస్ లో తెరకెక్కిన సింగం, సింగం-2 సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఈ సినిమాలకు సీక్వెల్ గా ముచ్చటగా మూడో సారి  తెరకెక్కిన సింగం-3 ఆ రేంజ్ హిట్ కొట్టిందా..? ఈ క్రేజీ సూపర్ హిట్ సీక్వెల్ తో సూర్య మరో భారీ విజయాన్ని అందుకున్నాడో లేదో చూద్దాం.

ఇక కధలోకి వెళ్తే…

ఈ సినిమాలో సూర్య .. నరసింహగా, శృతి హాసన్.. అగ్నిగా,  అనుష్క .. కావ్యగా నటించారు.

ఏపిలో  పేరు మోసిన పోలీస్ ఆఫీసర్ నరసింహ.  ఒక కమీషనర్ హత్యకు సంబంధించిన ఓ ప్రత్యేక కేసును కర్ణాటక హోం మంత్రి..  నరసింహకు అప్పగిస్తాడు.  ఆ కేసును తనదైన శైలిలో విచారించి హంతకులను పట్టుకున్న నరసింహ కమీషనర్ హత్య వెనుక విఠల్ అనే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడని  తెలుసుకుంటాడు.  ఆ తర్వాత ఈ కేసును పూర్తి చేయడం తన పర్సనల్ మిషన్‌గా పెట్టుకున్న నరసింహ…  ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍ పై ఎలా పోరాటం చేశాడు. నరసింహ…  తన భార్య కావ్యకు ఎందుకు దూరంగా ఉన్నట్లు నటిస్తాడు..? శ్రుతికి.. నరసింహకి సంబంధం ఏంటి అన్న ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.  

ఇక కధనం  ఏంటంటే..?

 ‘సింగం’ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడవగా, సింగం-2 సిటీకి వస్తాడు. ఇప్పుడు వచ్చిన సింగం-3 పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక కేసును ఛేదించే పనిలో విదేశాల్లో ఉన్న విలన్ తో పోరాడి అతన్ని ఓడించడం అనే సినిమానే సింగం-3. ఫస్టాఫ్ స్లోగా ఉన్నా సెకండాఫ్ మాత్రం పరుగులు పెట్టేసింది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాల నుండి సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ లో సాగుతుంది.

ఇక ఎవరు ఎలా చేశారంటే..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎగ్రెసివ్ గా కనిపిస్తూ సూర్య చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్స్ సూపర్బ్. కేవలం సూర్య పెర్ఫార్మెన్స్ మీదే సినిమా నడిచిందని చెప్పాలి. శ్రుతి గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైంది. అనూష్క ఆ గ్లామర్ తో కూడా ఆకట్టుకోలేకపోయింది. విలన్ పాత్ర చాలా బలంగా ఉండి హీరోకు ఛాలెంజింగ్ గా నిలబడింది. స్క్రీన్ ప్లే లో సిద్దహస్తుడైన హరి సింగం-3 లో మాత్రం రొటీన్ కథకు  భారీ  యాక్షన్ సన్నివేశాలను జోడించి నడిపించేశాడు. శశాంక్‌ వెన్నెల కంటి మాటలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్:

సూర్య నటన

యాక్షన్ ఎపిసోడ్స్

ప్రీ ఇంటర్వెల్

మైనస్  పాయింట్స్:

రొటీన్ కధ, కధనం

సాంగ్స్, కామెడీ

ఆఖరి పంచ్: ఇది సింగం-3 కాదు సింగం-2నే

Telugu Bullet Rating: 2.5/5