హీరోయిన్ గా మరో యాంకర్..!

Posted December 17, 2016

Small Screen Anchor Turn As Heroines For Tollywoodస్మాల్ స్క్రీన్ మీద ఏర్పరచుకున్న ఇమేజ్ తో హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తుంటారు బుల్లితెర యాంకర్లు. నిన్న మొన్నటిదాకా స్మాల్ స్క్రీన్ మీద తన క్యూట్ యాంకరింగ్ తో అలరించిన లాస్య ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. శ్రీరామరాజ్యం నిర్మాత సాయి బాబు తనయుడు రేవంత్ హీరోగా నటిస్తున్న రాజా మీరు కేక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది లాస్య. బుల్లితెర మీద తనకున్న ఇమేజ్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించడం విశేషం.

నూతన దర్శకుడు కృష్ణ కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నందమూరి హీరో తారకరత్న విలన్ గా చేస్తున్నాడు. హీరోగా ఫెయిల్ అయిన తారకరత్న రాజా చెయ్యి వేస్తే సినిమా ద్వారా విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు. అడపాదడపా చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తున్న తారకరత్న ఫుల్ టైం విలన్ గా మారుతున్నాడట. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రేవంత్ మొదటి సినిమా ఇంటింటా అన్నమయ్య రిలీజ్ అవ్వలేదు కాని ఆ సినిమా పోస్టర్ తో అందరికి సుపరిచితమయ్యాడు.

మరి రేవంత్ తో జతకడుతున్న లాస్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం బుల్లితెర మీద తమ హవా కొనసాగిస్తున్న యాంకర్లు అనసూయ, రష్మి, శ్రీముఖిలు ఓ పక్క సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు మరి లాస్య కూడా వారి లిస్ట్ లో చేరుతుందో లేదో చూడాలి.