జియో పై సోషల్ మీడియాలో తాజా జోక్ ..

0
200

September 27, 2016 social media joke jio
రిలయెన్స్ జియో గురించి వ్యాపార ప్రత్యర్ధులు ఎంతగా భయపడుతున్నారో చూస్తూనే వున్నాం.సామాన్యుల్లో సైతం ఇప్పుడు ఉచితం సరే ….భవిష్యత్ ప్యాకేజ్ ఎలా ఉంటుందోనన్న సందేహం వుంది.టెలికాం రంగంలో ఎంతోకొంత అవగాహన ఉన్నోళ్లు కూడా అదే డౌట్ వ్యక్తపరుస్తున్నారు.ఆ డౌట్ లు జోకుల రూపంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.అలాంటిదే ఇప్పుడు ప్రచారంలో వున్న తాజా జోక్ మీకోసం ..

ఓ ప్రముఖ బిజినెస్ మాన్ ఒక జూ(Zoo) ప్రారంభించాడు

“తలా ఒక్కంటికి 50/- “

అని బోర్డు పెట్టాడు.. ఎవరు రాలేదు..
రేటు తగ్గించి 25/- చేసాడు.. ఎవరూ రాలేదు.. ఇంకా తగ్గించి.20/-..తరవాత 10/- అయినా ఎవరూ రాలేదు..
ఇలాకాదని “Entry Free” అని బోర్డు పెట్టాడు..
అంతే ఎక్కడినుంచి వచ్చారో తెలియదు కాని క్షణాల్లో నిండిపోయింది జూ..

అందరూ లోపలికి వెళ్ళాక హౌస్ ఫుల్ బోర్డు పెట్టి గేట్లు మూసేసి… సింహాన్ని వదిలాడు..

అందరూ ప్రాణభయంతో బయటికి పరుగులు తీసారు….
గేటు మూసి ఉంది..
గేటు ముందు బోర్డు ఉంది …..

ఎగ్జిట్ ఫీజు 200/-….
.
ఆ జూ కి జియో(Jio)zoo అని పేరు పెట్టారు..