పవన్, జగన్ మధ్య సమ్ థింగ్ ?

Posted February 1, 2017

something between pawan and jagan
జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం జరగలేదు. ఎందుకనో పవన్ మొదటి నుంచి వైసీపీపై సైలెంట్ గానే ఉన్నారు. ఇక జగన్ కూడా పవన్ పై ఎప్పుడూ హాట్ డైలాగులు పేల్చలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఒప్పందం జరిగి ఉంటుందన్న అనుమానాలున్నాయి. తాజాగా పవన్ చేసిన కామెంట్స్ మాత్రం ఈ ఊహాగానాలు ఊతమిచ్చేలా ఉన్నాయి.

వైకాపా అయినా… మరే పార్టీ అయినా తనకు వ్యక్తిగత కోపం లేదని పవన్ చెప్పుకొచ్చారు. సీపీఐ రామకృష్ణతోనూ మాట్లాడానని తెలిపారు. అంతేకాదు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా తనకు లీడ్ చేసే అనుభవం లేదన్నారు. అంటే దానికి నాయకత్వం వహించే సత్తా జగన్ కే ఉందని పవన్ హింట్ ఇచ్చారా..? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో జగన్- పవన్ మధ్య ఒప్పందం కుదిరిందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉంది కాబట్టే… జగన్, పవన్ సైలెంట్ గా పని చేసుకుంటున్నారన్న విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. అటు బీజేపీ కూడా ఏదో ఉందని అంచనా వేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. పవన్, జగన్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు టీడీపీ- బీజేపీ నాయకులు. అటు వైసీపీ-జనసేన నాయకులు ఇది నూటికి నూరు శాతం నిజం కావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారట. ఎందుకంటే ఇద్ద‌రు నాయ‌కుల రాజ‌కీయ భ‌విత‌వ్యం ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో ఇద్ద‌రూ క‌లిస్తే త‌ప్ప చంద్ర‌బాబును ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మేన‌ని వైసీపీ-జ‌న‌సేన క్యాడ‌ర్ కూడా అంగీక‌రిస్తున్నార‌ని టాక్. అందుకే ఆదిశ‌గా ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.