నిద్ర‌పోయిన పులుల‌ను లేపుతున్న సోము వీర్రాజు!!!

Posted January 22, 2017

somu veeraju making naxelites angry
ఏపీ బీజేపీలో వివాదాస్ప‌ద అంశాలు మాట్లాడే ఏకైక నాయ‌కుడు ఎవరంటే ముందుకు గుర్తుకొచ్చేది సోము వీర్రాజు. ఇప్పుడు మ‌రోసారి కాంట్రావ‌ర్షియల్ కామెంట్స్ చేశారాయ‌న‌. అది కూడా న‌క్స‌ల్స్ పై. వారికి ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తూ ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

న‌క్స‌లైట్లు ఎవ‌రని ప్ర‌శ్నించారాయ‌న‌. పేదవాళ్లను చంపడానికే నక్సలైట్లు వచ్చారా? అని నిల‌దీశారు. మావోయిస్టులు ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను చంపమనండి. వీళ్ల వద్ద డబ్బులు తీసుకుని డంప్‌లో దాచుకుని తర్వాత లొంగిపోతున్నారు. అడవిలో పడుకోవడం కాదు. దమ్ముంటే బ్యాగ్‌వేసుకుని వచ్చి ఇక్కడ తిరగమనండి … అంటూ వీర్రాజు సవాల్‌ విసిరారు.

వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతోంది. అస‌లే న‌క్స‌లైట్లు కాక మీద ఉన్నారు. వ‌రుస ఎన్ కౌంట‌ర్ల‌తో నైతికంగా దెబ్బ‌తిన్నారు. ఈ స‌మ‌యంలో వీర్రాజు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం అవ‌స‌ర‌మా అన్న వాదన వినిపిస్తున్న‌ది. ఎమ్మెల్యేలను చంప‌మ‌నండి అంటూ స‌వాల్ చేయ‌డం శృతి మించి మాట్లాడమేనంటున్నారు చాలామంది.

రాజ‌మహేంద్ర‌వ‌రంలో కూర్చొని నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డం వీర్రాజుకే సాధ్య‌మ‌ని ఇత‌ర పార్టీల నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఎమ్మెల్యేల‌ను చంప‌డ‌మే ఆయ‌న ఉద్దేశ్య‌మా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. విమ‌ర్శ‌లు శృతి మించితే మొద‌టి మోస‌మ‌ని ఆయ‌న గుర్తుంచుకోవాలి. నిద్ర‌పోతున్న పులుల‌ను లేపితే ఏం జ‌రుగుతుందో ఇంకా ఆయ‌న‌కు తెలియ‌న‌ట్టుంది అని చుర‌క‌లు వేస్తున్నారు పొలిటిక‌ల్ లీడ‌ర్స్. ఏదేమైనా వీర్రాజు వ్యాఖ్య‌ల‌తో ఏవోబీ నాయ‌కులైతే భయం గుప్పిట్లో బతుకుతున్నార‌ట‌. ఆయ‌న కామెంట్స్ త‌మ ప్రాణం మీదకు వ‌స్తాయోమోన‌ని గాబ‌రాప‌డుతున్నార‌ని టాక్.