అమ్మాయి కోసం అమ్మ హత్య!!

Posted December 22, 2016

son kills his mother with gun for girl in bhopal
ప్రేమ ఓ మాయ.ఆ మాయలో పడ్డోళ్లకు ఏం తెలియదు.ప్రేమ మైకంలో మునిగిపోయిన ఓ కిరాతకుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడో తెలిస్తే అయ్యో అనక తప్పదు . ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా సొంత తల్లినే పొట్టనబెట్టుకున్నాడీ దుర్మార్గుడు.

భోపాల్ నగరంలోని గౌతంనగర్ ప్రాంతానికి చెందిన జమీలాబి బీజేపీ మహిళా విభాగం నాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అమన్ (22) అనే కుమారుడున్నాడు. అతను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. తల్లితో ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానన్నాడు. కానీ అందుకు వ్యతిరేకించింది. అంతే కోపంతో ఊగిపోయిన అతను ఏకంగా తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. తల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు.

తల్లిని పొట్టనబెట్టుకున్న అనంతరం ఈ కిరాతకుడు కట్టుకథ అల్లాడు. తాను హాలులో నిద్రపోతుండగా తల్లిని ఎవరో వచ్చి కాల్చిచంపారని అమన్ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మళ్లీ మాట మార్చాడు. పోలీసులకు అనుమానం వచ్చింది. నాలుగు తగిలిస్తే అప్పుడు నిజం బయటకు చెప్పేశాడు. తానే తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ వార్త విని స్థానికులు ఆశ్చర్యపోయారట. ఈ కిరాతక పుత్రుడికి శాపనార్థాలు పెట్టారట. అయినా అమ్మాయి కోసం అమ్మను హత్య చేయడం ఎంత దుర్మార్గం!!