శ్రీయ కూడా తగ్గట్లేదసలు..!

Posted December 13, 2016

Sreya Saran Lucky Chance Kollywood Moviesదశాబ్ధ కాలానికి పైగా కెరియర్ ప్రారంభించి అదే క్రేజ్ తో ఇప్పటికి అవకాశాలను అందుకుంటున్న శ్రీయా ఈ మధ్య కెరియర్ దాదాపు అయిపోయింది అనుకునేసరికి అనుకోకుండా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ ల సరసన నటిస్తున్న ఈ అమ్మడు బాలయ్య ప్రెస్టిజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. ఇక ఈ అవకాశంతోనే తమిళంలో మరో సూపర్ ఛాన్స్ కొట్టేసిందట శ్రీయ.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ థ్రిల్లర్ మూవీని కోలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని కన్ ఫ్యూజన్లో ఉండగా శ్రీయా ఆ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందని టాక్. ముందు ఎవరెవరినో హీరోయిన్ గా అనుకోగా తర్వాత శ్రీయా పర్ఫెక్ట్ అనిపించడంతో ఆ ఛాన్స్ ఇచ్చేశారట. ఓ పక్క కుర్ర హీరోయిన్స్ హవా కొనసాగిస్తున్నా కెరియర్ ప్రారంభించిన నాటి నుండి శ్రీయా తన మార్క్ నటనతో అందరిని ఆకట్టుకుంటుంది.

మరి అవకాశాలను చూస్తుంటే శ్రీయా మళ్లీ కెరియర్ పీక్స్ లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా రెండు మూడు అవకాశాలు కూడా అమ్మడి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయట. సో మొత్తానికి శ్రీయా కూడా సినిమాలతో బిజీగా ఉందన్నమాట.