అయ్యో పాపం… అతిలోకసుందరి

Posted February 3, 2017

sridevi attend to function without makeup she feels shy in front of cameraఐదు పదుల వయసు దాటినా అతిలోకసుందరి శ్రీదేవి ఇంకా తన గ్లామర్ ని కాపాడుకుంటూ అప్పుడప్పుడూ వెండితెరపై కనువిందు చేస్తోంది. అంతేకాదు  అప్పుడప్పుడూ  కూతుళ్ల  ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంటుంది. ఆ ఫొటోలను చూసిన వారెవరైనా ఆమె కూతళ్ల కంటే ఆమే అందంగా ఉందని, గ్లామర్ విషయంలో కూతుళ్లతో పోటీ పడుతోందని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు చెప్పినదంతా మేకప్ వేసుకున్నప్పటి సంగతి.  

మేకప్ లేకుండా అసలు సినీ తారలెవరూ బయటకే రారనుకోండి…కానీ ఒక్కోసారి మేకప్ లేకుండా కెమెరాల కంటికి చిక్కుకుని తెగ ఇబ్బంది పడిపోతుంటారు. తాజాగా శ్రీదేవి కూడా మేకప్ లేకుండా ఓ ఫంక్షన్ కి వచ్చి ఓల్డేజ్ ని దాచలేక ఇబ్బంది పడుతూ ఇలా దొరికిపోయింది. పెళ్లీడుకొచ్చిన కూతుళ్లున్న ఆమె… కొంచెం సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే హీరోయిన్లు కావాల్సిన కూతుళ్ల  ఉన్న శ్రీదేవి ఇంకా  గ్లామర్ కోసం పాకులాడకుండా  తన వయసుకు తగ్గట్లు నడుచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారట ఆమె సన్నిహితులు.