నలుగురు యంగ్ హీరోలతో  రెడీ కానున్న మల్టీస్టారర్..

Posted February 6, 2017

sri ram aditya to direct multi starrer movie with four heroesప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ల హవా నడుస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమ మల్లీస్టారర్ ల కేరాఫ్ అడ్రస్ గా మారింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ముందు అడపాదడపా వచ్చిన మల్టీస్టారర్ లలో  కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకోగా మరికొన్ని యావరేజ్ అయిన సంగతి తెలిసిందే.  ఎప్పుడో ఎన్టీఆర్ జమానాలో వచ్చిన మల్టీస్టారర్ ల తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న సినిమాగా వెంకీ, మహేష్ లు నటించిన ఈ సినిమాని చెప్పుకోవచ్చని కొందరు సినీ నిపుణులు అంటున్నారు.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను కూడా రాబటట్ గలిగిందని, దీంతో సినీ వర్గాలు  మల్టీస్టారర్ ల వెనకపడ్డాయిని సినీ నిపుణుల అభిప్రాయం.

ఈ కోవలోనే వచ్చిన  బాహుబలి, మనం  సినిమాలు  కూడా భారీ మల్టీస్టారర్ లు గా చరిత్ర సృష్టించాయి.  రీసెంట్ గా  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ ను చేయనున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ఎనౌన్స్ చేశారు. కాగా త్వరలోనే మరో మల్టీస్టారర్ రానుందని సమాచారం. ఇందులో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు నటించనున్నారు.

విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా నటించిన సుధీర్ బాబు, తెలుగు-తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్, మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఆది కలిసి ఈ సినిమాలో నటించేదుకు సంతకాలు చేశారని సమాచారం. భలే మంచి రోజు సినిమాను రూపొందించిన  శ్రీరాం ఆదిత్య  ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ నెలాఖరుకి ప్రారంభంకానున్న ఈ సినిమా ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో సాగనుందని తెలుస్తోంది. ఇక హీరోల సరసన నటించే హీరోయిన్ల వేటలో సినిమా టీమ్ బిజీగా ఉందట. ఏమైనా నలుగురు హీరోలు కలసి ఒకే సినిమాలో నటించడం చాలా గ్రేట్ అంటున్నారు సినీ వర్గాలు.