పెళ్లైనా సినిమాల్లో చేస్తా: శ్రుతి హాసన్

Posted February 8, 2017

sruthihassan continues acting after marriageటాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ ని కూడా ఏకకాలంలో ఏలుతున్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రుతిహాసన్. ఈ అమ్మడు.. హీరో సూర్యతో కలిసి నటించిన సింగం-3 రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె  మీడియాకిచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 తన మనసుకు అనిపించింది భయం లేకుండా చేస్తానని, ఎదుటివారి నుండి ప్రశంసలను ఆశించకుంటే విమర్శలను, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపంది. అలాగే తనకు పెళ్లైనా నటిస్తానని, నటన కూడా వృత్తిలాంటిదేనని వివరించింది.  భర్త చెప్పాడనో, అత్త నో అందనో నటనను త్యాగం చేయకూడదని అభిప్రాయపడింది.

తనకు పెళ్లైనా, తాను పిల్ల తల్లైనా కూడా నటిస్తానని, నటన అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి కోరికను యాక్స్పెట్ చేసే పెళ్లికొడుకు ఎవరో చూడాలి.