సెల్వంకు స్టాలిన్ ఝ‌ల‌క్!!!

 Posted February 16, 2017

stalin shock to panneer selvam
డీఎంకే అండ‌తో దుమ్మురేపేదామ‌నుకున్న ప‌న్నీర్ సెల్వంకు … స్టాలిన్ ఝ‌ల‌క్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి నిన్న మొన్న‌టిదాకా సెల్వంకు మ‌ద్ద‌తిస్తాన‌ని స్టాలిన్ ప్ర‌క‌టించారు. కానీ శ‌శిక‌ళ జైలుకెళ్ల‌డంతో ఆయ‌న ప్లాన్ మారింది. ఇప్పుడు ఆ విష‌యంపై నోరెత్త‌డం లేదాయ‌న‌. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌పై ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

స్టాలిన్ భ‌రోసాతోనే ప‌న్నీర్ సెల్వం బ‌లనిరూప‌ణ అంటూ గొంతెత్తారు. ఆ ధైర్యంతోనే గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. కానీ స్టాలిన్ మాత్రం ఇప్పుడు సెల్వంకు మ‌ద్ద‌తు విష‌యంలో నాన్చుతున్నారు. డీఎంకే పార్టీ మీటింగ్ లోనూ ఈ విష‌యంపై ఆయ‌న క్యాడ‌ర్ కు సిగ్న‌ల్స్ ఇచ్చార‌ట‌. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మేనంటూ క్యాడ‌ర్ లో ఉత్సాహం నింపారు.

సెల్వంకు బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యం వ‌చ్చేదాకా స్టాలిన్ మౌనంగా ఉంటార‌ట‌. క‌రెక్ట్ గా బ‌లనిరూప‌ణ స‌మ‌యంలో సెల్వంకు షాకిచ్చే యోచ‌న‌లో ఉన్నార‌ట స్టాలిన్. మొత్తానికి ఇప్ప‌టినుంచే డీఎంకే మ‌ధ్యంత‌రం కోసం రెడీ అవుతోంద‌ట‌. పార్టీ బ‌లాబ‌లాల‌పై ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని టాక్. సెల్వం ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం ద్వారా వ‌చ్చే ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నిలో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చూడాలి మ‌రి… స్టాలిన్ చెయ్యిస్తే… త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఏ ట‌ర్న్ తీసుకుంటాయో?