సుబ్రమణ్య స్వామి మోడీ కి చెప్పింది ఇదే…

Posted December 3, 2016

Image result for Subramanian Swamy said to modi
తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి స్పందించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురించి మాట్లాడిన ఆయన.. నోట్ల రద్దు నిర్ణయంతో యావత్ దేశ వ్యాప్తంగా నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దాలని ఆయన సూచించారు. అలా చేయని పక్షంలో పరిణామాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. ప్రజాదరణ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని స్వామి హెచ్చరించారు.

నోట్ల రద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణమే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి సూచించారు. ఇలా చేస్తే నోట్ల రద్దు ఎఫెక్ట్ వచ్చే (2019) ఎన్నికల్లో పెద్దగా ఉండదని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ప్రజలకు కొంతవరకు ఇబ్బందులున్నాయి నిజమే.. దీంతో ప్రభుత్వంపై మొదట వ్యతిరేకం వచ్చినా ఆపై పరిస్థితులు చక్కబడుతాయ్ అన్నట్లుగా స్వామి చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియాలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఆరు నెల్ల ఎమర్జెన్సీ అనంతరం ప్రభుత్వంపై ప్రజలకు అభిప్రాయాలు మారాయి. దీంతో ప్రజాదరణ అంతా ఆమెకు సానుకూలంగా మారి జై కొట్టారని స్వామి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు…