ఈరోజుల్లో హండ్రెడ్ డేస్ అంటే

Posted November 5, 2016

pc1516సినిమా ప్రభావం ప్రేక్షకుల్లో ఎక్కువ ఉండటంతో ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే లెక్కలు పోయి కంటెంట్ ఉన్న సినిమా లేని సినిమా అని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు సినిమా తీస్తే చాలు ఆ సినిమా బడ్జెట్ 100 కోట్లా, కోటి లోపా అన్నది చూడట్లేదు. ప్రస్తుతం ఈ సీజన్లో సూపర్ హిట్ సినిమాగా చిన్న సినిమాల్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపటితో వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిట్ సినిమా కూడా వంద రోజులు ఆడలేని విధంగా ఉంది. అలాంటిది పెళ్లిచూపులు హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే ఓ సంచలనం సృష్టించిందని చెప్పాలి. రాజ్ తరుణ్ నిర్మించిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో రిలీజ్ అయ్యింది. కంటెంట్ ఉంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రేక్షకులు వంద రోజులు ఆడించేస్తారు అని చెప్పడానికి పెళ్లిచూపులు సినిమా ఓ బెస్ట్ ఎక్సాంపుల్.