మోడీ వల్ల కాకపోతే నేనే ప్రతీకారం తీర్చుకుంటా

0
111

 Posted April 29, 2017 at 10:37

sukma encounter jawan mother says if modi does not kill maoist i will funished to maoistsసుక్మాలో ఎన్ కౌంటర్, కశ్మీర్ ఆర్మీ క్యాంప్ పై దాడి.. రెండు వరుస ఘటనల్లో అటు సీఆర్పీఎప్, ఇటు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నిఘా వైఫల్యం వల్లే విలువైన సైనికుల్ని కోల్పోతున్నామనే అభిప్రాయం వినిపిస్తోంది. మావోయిస్టులతో పాటు ఉగ్రవాదులపై చర్యల్లో వ్యూహాలు సమీక్షించుకోవాల్సిన అసరాన్ని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు దాడులు జరిగినప్పుడు తూతూ మంత్రపు సమీక్షలు, ఆర్భాటపు ప్రకటనలే కానీ.. కేంద్రం నుంచి చిత్తశుద్ధితో కూడిన చర్యలు కొరవడుతున్నాయి. అందుకే ఉగ్రవాదులు, మావోయిస్టులు రెచ్చిపోతున్నారు.

అయితే కేంద్రంతో పెట్టుకుంటే లాభం లేదనుకున్న ఓ తల్లి.. తన కుమారుడి చావుకి తానే ప్రతీకారం తీర్చుకుంటానంటోంది. కశ్మీర్ టెర్రరిస్ట్ ఎటాక్ లో చనిపోయిన ఓ జవాను తల్లి బాథ అందర్నీ కలచివేస్తోంది. మోడీకి చేతకాకపోతే నేనే పగ తీర్చుకుంటానన్న ఆ తల్లి మాటలు విన్నాక అయినా.. కేంద్రం సిగ్గుతో తల దించుకోవాల్సి ఉంది. మావోయిస్టులతో రాజకీయ నాయకులకు సత్సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఎన్నికల సమయంలో వారి సహకారం తీసుకుంటూ.. తర్వాత తూతూ మంత్రంగా జవాన్లతో దాడులు చేయిస్తారనే అనుమానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎన్ కౌంటర్లు చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఇక వేర్పాటువాదులతోనూ అన్ని పార్టీలకు సంబంధాలున్నాయని తెలుస్తోంది.

మరోవైపు కశ్మీర్ ప్రజల కోసం జవాన్లు ప్రాణాలు త్యాగం చేస్తుంటే.. వాళ్లు మాత్రం ఉగ్రవాదులపై స్పందించిన్ంతగా మన జవాన్లు చనిపోయినప్పుడు కనీసం జాలి చూపించడం లేదు. టెర్రరిస్ట్ ఎఠాక్ తర్వాత ఉగ్రవాదుల మృతదేహాల కోసం పట్టుబట్టిన స్థానికులు.. జవాన్లు ఎలా ఉన్నారని మాత్రం అడగలేదు. దీన్ని బట్టి వారికి దళాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కానీ దీనికి సైనికుల నిష్క్రియాపరత్వం కూడా కారణమనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా కేంద్రం ఇప్పటికైనా వ్యూహాలు సమీక్షించుకుని, వీలైనంతగా ప్రాణనష్టం తగ్గించాల్సిన అవసరం కనిపిస్తోంది.