సుమన్ వస్తానంటున్నాడు..పిలిచేదెవరు?

0
114

Posted April 25, 2017 at 11:03

suman wants to enter politics
సీనియర్ నటుడు సుమన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించారు.అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ఓ పార్టీ తరపున పోటీ చేయడమే కాకుండా ఆ పార్టీ కోసం ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే సుమన్ తాను రావడానికి సిద్ధమని చెబుతున్నా ఇప్పటికీ ఆయనకి ఏ పార్టీ తరపున ఆహ్వానం కానీ,టికెట్ మీద హామీ కానీ లభించలేదని తెలుస్తోంది.పైగా అసలు ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో అర్ధం కాకపోవడంతో ఆయన వస్తే చూసుకోవచ్చు అన్న ధోరణిలో వున్నాయి పార్టీలు కూడా.పైగా మారిన రాజకీయ పరిస్థితుల్లో పార్ట్ టైం నేతలతో నెట్టుకురావడం కష్టమని అన్ని పార్టీలకు అర్ధమైంది.అందుకే సుమన్ నేను వస్తానంటున్నా ఎవరూ పిలవడం లేదు.