కోటిలోనే కానిచ్చేశాడట..!

sm1316స్టార్ సినిమా బడ్జెట్ అంటే లెక్క లేనన్ని ఖర్చులుంటాయి అందుకే చాలా వరకు అనవసరంగా పెట్టాల్సి వస్తుంది. కాని ఓ చిన్న హీరో చిన్న సినిమా తీస్తే దానికి ప్రతి ఒక్క రూపాయి ఉపయోగపడుతుంది. ఈ ఇయర్ ఇప్పటికే కోటి లోపు బడ్జెట్ తో వచ్చి సంచలన విజయాలను దక్కించుకున్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అదే దారిలో సుమంత్ నటించిన నరుడా డోనరుడా కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దశాబ్ధ కాలం పైగా సినిమాలు చేస్తున్నా కనీసం సరైన హిట్ లేకుండా కెరియర్ కొనసాగించాడు సుమంత్.

ఏమో గుర్రం ఎగురావచ్చు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుమంత్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కి డోనార్ రీమేక్ గా నరుడా డోనరుడాతో వస్తున్నాడు. సినిమా బడ్జెట్ కోటి లోపే అని తెలుస్తుంది. అయితే దీనికి ప్రొడక్షన్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ దే వాడటం వల్ల అలా కలిసి వచ్చిందట. మరి తగ్గిన ఈ బడ్జెట్ తో ఈసారైన సుమంత్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ట్రైలర్ పోస్టర్ అన్ని సినిమా మొత్త ఎంటర్టైన్మెంట్ జానర్లోనే వెళ్లినట్టు కనిపిస్తుంది. మరి ఈ విత్తనాల డోనర్ కు ఆడియెన్స్ హిట్ డొనేట్ చేస్తారో లేదో మరో 24 గంటలు ఆగితే తెలుస్తుంది.