చిన్నమ్మకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వని సుప్రీమ్..

Posted February 15, 2017

supreme court decided to arrest seshikala
పార్టీ పదవితో సంతృప్తి పడకుండా ఏ క్షణంలో అయితే సీఎం పగ్గాలు చేపట్టాలని శశికళ నిర్ణయించుకుందో అప్పటి నుంచి ఆమెని కష్టాలు వెంటాడుతూనే వున్నాయి.ఇప్పటికే నాలుగేళ్లు జైలు, 10 కోట్ల జరిమానా విధించిన సుప్రీమ్ కోర్ట్ తాజాగా శశికళకి ఇంకో షాక్ ఇచ్చింది.ఆరోగ్యం బాగాలేనందున కోర్టులో లొంగిపోవడానికి నాలుగు వారాల సమయం కావాలని శశికళ సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేసింది.దాన్ని సుప్రీమ్ నిరాకరించింది.సుప్రీమ్ ఆదేశాలు వెలువడిన వెంటనే కోర్ట్ లో లొంగిపోవడానికి ఆమె బెంగళూరు బయలుదేరింది.