సర్జికల్ స్ట్రైక్స్ స్పూర్తితో ఇరాన్ హుషారు

0
104

Posted May 9, 2017 at 16:06

పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్దేశపూర్వకంగా చిచ్చు రాజేస్తోందని అందరికీ తెలుసు. కానీ మన రావణకాష్టం రగులుతూ ఉండగానే.. అటువైపు ఇరాన్ ను కూడా కెలుకుతోంది దాయాది దేశం. ఇరాన్ సరిహద్దుల్లో పహారా కాస్తున్న రివల్యూషనరీ గార్డ్స్ పై పాక్ నుంచి వచ్చిన సున్నీ మిలిటెంట్లు విరుచుకుపడటంపై ఇరాన్ చాలా సీరియస్ గా ఉంది. పద్ధతి మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరిస్తోంది.

ఇరాన్ లో షియాల ప్రాబల్యం ఎక్కువ, పాక్ లో సున్నీల మెజార్టీ ఎక్కువ. ముస్లిముల్లో మొదట్నుంచీ సున్నీ వర్సెస్ షియా వార్ నడుస్తోంది. అందుకే పాక్ కు సున్నీ దేశాలన్నీ మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇరాన్ కు ఉన్న సైనిక బలం దృష్ట్యా పాక్ కాస్త తగ్గి ఉంటే బెటరనేది యుద్ధ నిపుణుల అంచనా. కానీ పాకిస్థాన్ మాత్రం తోడ జాడింపులు మానుకోవడం లేదు.

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ను నిశితంగా గమనించిన ఇరాన్.. అవి మంచి ఫలితాన్నిచ్చినట్లు అభిప్రాయపడింది. తాము కూడా ఇదే రీతిలో ఎటాక్ చేస్తామని ఇరాన్ పాక్ ను హెచ్చరించింది. ఇరాన్ నిజంగా దాడికి దిగితే… పరిస్థితి ఏంటనే విషయంపై పాకిస్థాన్ ఇప్పటికే అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించింది. డ్రగ్ స్మగ్లింగ్ గ్యాంగులే టార్గెట్ గా విరుచుకుపడతామని ఇరాన్ చెప్పడంతో.. సరిహద్దులో అదనపు భద్రత ఏర్పాటుచేస్తామని పాక్ చెప్పినట్లు సమాచారం.