సింగం3.. అక్కడా.. ఇక్కడ కూడా !

Posted October 4, 2016

 suriya singam 3 movie shooting telugu states tamilnadu state

సింగం సీక్వెల్ ‘సింగం3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. సింగం సిరీస్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సింగం, సింగం2 టాలీవుడ్ లోనూ మంచి కలెక్షన్స్ ని రాబట్టాయి. ఈ నేపథ్యంలో తెలుగు ‘సింగం3’ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారమ్. సింగం సిరీస్‌ తెలుగులో కూడా హిట్ అవ్వ‌డంతో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ కార‌ణంతోనే తెలుగు ప్రాంతాల్లో కూడా సింగం3 షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘సింగం3’ వైజాగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. మిగిలిన కొన్ని కీలక సన్నివేశాలని కూడా తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఇక్కడే చిత్రీకరణ జరపనున్నారు.

ఇదిలావుండగా.. సింగం3లో సూర్య సరసన అనుష్క‌, శృతిహాస‌న్‌లు జతకట్టనున్నారు. అనుష్క సింగం, సింగం2లోనూ కథానాయికగా కనిపించింది. ఇక,
సింగం 2లో హన్సిక మెరవగా.. సింగం3 కోసం శృతిహాసన్ ని తీసుకొన్నారు. అన్నట్టు.. డిసెంబ‌ర్ 16న సింగం3 ప్రేక్షకుల ముందుకు రానుంది.