గ్యాంగ్ స్టర్ గా సూర్య..!

Posted November 22, 2016

surya gangster in selva raghavan movieఒక్కో హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే ఏ క్యారక్టర్ లో అయినా ఫిక్స్ అయ్యే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. ఈ క్రమంలో సౌత్ సూపర్ హీరో విలక్షణ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న సూర్య మరోసారి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే లింగుసామి డైరక్షన్లో అంజాన్ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించిన సూర్య ఆ సినిమా ఫ్లాప్ తో మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు.

సింగం సీరీస్ లతో సూపర్ ఫాంలో ఉన్న సూర్య ఇప్పుడు మరోసారి సెల్వ రాఘవన్ డైరక్షన్లో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో సినిమా కమిట్ అయిన సూర్య ఆ తర్వాత సెల్వ రాఘవన్ తో సినిమా చేస్తున్నాడు. సూర్య గ్యాంగ్ స్టర్ రోల్ అనగానే ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది. మళ్లీ అంజాన్ రిజల్ట్ ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది.

ఈ ఇయర్ 24 సినిమాతో హిట్ అందుకున్న సూర్య విఘ్నేష్ శివన్ మూవీ ఫుల్ లెంథ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీస్తున్నారట. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే సెల్వ రాఘవన్ సినిమాను షురూ చేయనున్నాడు సూర్య.