రాణి పాత్రపై సుస్మితా ఆశలు..

 susmitha sen hope act aankhen movie raani character మోడలింగ్ నుంచి నటిగా మారి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుస్మితాసేన్‌. గతంలో పలు చిత్రాల్లో నటించి అందరి మెప్పు పొందింది ఈ మాజీ విశ్వ సుందరి. నలభై ఏళ్లు వచ్చినా వన్నె తరగని సౌందర్యం ఆమె సొంతం. లేటెస్ట్‌గా ఈ సొగసరి ‘ఆంఖే-2’పై స్పందించింది. 2002లో తెరకెక్కిన ‘ఆంఖెన్‌’ చిత్రంలో ముఖ్య భూమిక పోషించింది సుస్మితా. అది మంచి విజయాన్నే కైవసం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘ఆంఖెన్‌-2’కు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై తన మనసులోని మాటను చెప్పింది సుస్మితా.

ఆంఖెన్‌’లో నటించడాన్ని తన అదృష్టంగా చెప్పిన సుష్.. దానికి సీక్వెల్‌గా ‘ఆంఖెన్‌-2’ తెరకెక్కడం చాలా ఆనందంగా ఉందని అంది. కానీ సీక్వెల్‌లో తానూ ఉంటే బాగుండేదని వ్యాఖానించింది. ఆంఖేన్‌లో ఆమె పాత్ర మరణంతో అంతమయింది. కాబట్టి ఇందులో ఆ రోల్‌కు అవకాశం లేదు. అయినా చిత్ర బృందం సంప్రదిస్తే తాను చేయడానికి సిద్ధమంటోంది. ఆత్మగా భయపెట్టడానికైనా రెడీ అని చెప్తోంది. కానీ ఆ చిత్ర బృందం తనను మిస్‌ అవుతోందంటూ సరదాగా ఆటపట్టిస్తోంది. వాళ్ల బ్యాడ్‌లక్. ఏదేమైనా ‘ఆంఖెన్‌’ సీక్వెల్‌ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటోంది సుస్మితా.