గాలి ఇంట్లో హీరోయిన్ల లక్షల బేరాలు..!

Posted November 17, 2016

Tamanna Rakul Crazy Dance Show At Gali Janardhan Reddy Daughter's Marriageగాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సిని కలరింగ్ అద్దడంతో వచ్చిన అతిధులందరు ఇంకాస్త జోష్ తెచ్చుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ల డ్యాన్స్ లు హైలెట్ గా నిలిచాయి. అప్పటికే వారి డిమాండ్ కు తగ్గట్టు బేరం మాట్లాడుకున్న ఈ భామలు ఒక్కొక్కరు లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ కు ఈవెంట్ లో డ్యాన్స్ చేసినందుకు గాను 20 లక్షలు ఇవ్వగా తమన్నాకు ఏకంగా 70 లక్షల దాకా ఇచ్చారట.

అంటే ఓ సినిమాకు రావాల్సిన మొత్తం ఓ ప్రోగ్రాం తో రాబట్టుకున్నారన్నమాట. హీరోయిన్స్ అంటేనే అదో సెపరేట్ క్రేజ్ ఇక గాలి లాంటి బడా బాబులు తమ స్టామినా చూపించే క్రమంలో హీరోయిన్స్ కు డబ్బులు గుమ్మరించి మరి ఈవెంట్ లకు బుక్ చేసుకుంటారు. సంచలనంగా మారిన గాలి ఇంట టాలీవుడ్ టాప్ క్వీన్స్ రకుల్, తమన్నాల డ్యాన్స్ షో స్పెషల్ క్రేజ్ తీసుకువచ్చేలా చేశాయి.

అయితే వారి తీసుకున్న రెమ్యునరేషన్ మిగతా హీరోయిన్స్ అందరు షాక్ అయ్యేలా చేసింది. ఏమాత్రం ఛాన్స్ వచ్చినా తమ టాలెంట్ బయట పెట్టి డబ్బులు వెనకేసుకునే హీరోయిన్స్ క్రేజ్ ఉన్నప్పుడే ఇలాంటి స్పెషల్ యాక్టివిటీస్ లో పాల్గొని దొరికినంత సంపాదించాలని చూస్తున్నారు.