తమిళ ఎంపీ, ఏంఎల్ ఏ అమ్మ కోసం ఆలా చేసారు..

Posted December 8, 2016

tamil mlas and mps about amma

ఇప్పటికీ మెరీనా బీచ్ జయలలిత అభిమానులతో మరో సంద్రం గా కనిపిస్తోంది. ఆమె సమాధి వద్ద రోదిస్తున్న వారిని చూస్తే అఆమే పై ప్రజల్లో యెంత అభిమానం ఉందో ఇట్టే అర్ధం అవుతుంది. ఒక కుటుంబానికి చెందిన వారు మరణిస్తే గుండు చేయించుకునే సంప్రదాయాన్ని ‘అమ్మ’ విషయంలోనూ కొనసాగిస్తున్నారు.అభిమానులు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, స్త్రీ,పురుష బేధము లేకుండా గుండు గీయించుకుంటున్నారు. ‘‘అమ్మ కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆమె మా కుటుంబం సభ్యుల్లో ఒకరు. మా అందరికీ అమ్మ. అందరికీ అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి’’ అని పేర్కొన్నారు. ‘‘ఆమె మా అభ్యున్నతి కోసం ఎంతో చేసారు మళ్లీ అలాంటి మంచి మనసున్న వ్యక్తి వస్తారో లేదో’’ అంటూ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.