“పన్నీర్” జల్లులు బాగానే కురుస్తున్నాయి..!!

Posted February 8, 2017

tamil nadu celebrities and social media praise to o panneerselvamతమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం నిన్న ‘అమ్మ’ జయలలిత  సమాధి వద్ద దాదాపు  నలభై నిమిషాలు గడిపారు.  ఆ తర్వాత అమ్మ మృతి గురించి,  తన రాజీనామా గురించి ప్రస్తావిస్తూ చిన్నమ్మ శశికళ గురించి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  త‌నకంటూ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు శశికళే శరణం అన్న ఆయన ఇప్పుడు చిన్నమ్మపై పోరుకి సిద్దమయ్యారు. ఇప్పటివరకు సైల్వాన్ని వీక్ సీఎం అనుకున్నవారే సెల్వం  ధైర్యంగా వేసిన రాజకీయ ఎత్తుగడకి, కదుపుతున్న పావులకి, శశకళ గురించి చేసిన వ్యాఖ్యలకి ఆయన్ని ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.  శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన క్షణం నుండి సెల్వానికి  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ప్రశసంలు కేవలం నెటిజన్ల నుండి మాత్రమే కాక పలువురు సినీ ప్రముఖుల నుండి కూడా రావడం విశేషం.

ముఖ్యంగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ తనదైన శైలిలో స్పందించింది. ఓపీఎస్‌ మౌనాన్ని వీడి ఓ  హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున ఓపీఎస్‌ పనిచేయడం లేదని నేను ఆశిస్తున్నానని ట్వీట్ చేసింది. ఇక కమల్ హాసన్ స్పందిస్తూ, ‘తమిళనాడు ప్రజలారా, త్వరగా నిద్రపోండి, రేపు వాళ్లు మనకంటే ముందే నిద్ర లేస్తారు.. గుడ్ నైట్’ అన్నారు. మెరీనాలో ఓపీఎస్‌,  తమిళనాడు రాజకీయాలు గేమ్‌ ఆఫ్‌ థోర్న్స్‌, హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌ అనే హాలీవుడ్‌ మూవీస్ ను తలపిస్తున్నాయని సిద్దార్ధ ట్వీట్ చేయగా, ఓపీఎస్ సార్..  సరైన సమయంలో గొప్పగా, ధైర్యంగా మాట్లాడారని, మీకు హాట్సాప్ అని ఆర్య ప్రశంసించాడు. ఇక గౌతమి స్పందిస్తూ..  అందుకే అమ్మ ఓపీఎస్‌ను ఎంచుకున్నారు. అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడమే అని ఆ ట్వీట్ ని ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్‌ చేసింది. ఇక అరవింద్ స్వామి…  ‘బఠానీలు తింటూ న్యూస్ చూస్తున్నాను, ఉప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది, ఇక  పాప్ కార్న్ తింటానని కాస్త చతురోక్తితో ప్రశంసించాడు. మరి ఇంకెంతమంది ప్రశంసల జల్లులు పన్నీర్ పై కురుస్తాయో చూడాలి.

kushboo tweet on o panneerselvam

kamal hassan tweet on o panneerselvam

arya tweet on o panneerselvam

aravind swamy tweet on o panneerselvam

gautami tweet on o panneerselvam

siddharth tweet on o panneerselvam