ఢిల్లీ చేతుల్లోకి తమిళ రాజకీయం?

Posted December 19, 2016

tamil politics to delhi hands
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టబోతున్న జయ నెచ్చెలి శశికళ రాజకీయంగా వేగంగా పావులు కదుపుతున్నారు. సీఎం పన్నీర్ సెల్వం పూర్తిగా నిలదొక్కుకోకముందే ఆమె తన అస్త్రాలు ప్రయోగిస్తున్నారు.అందులో మొదటిది జయ గెలిచినా ఆర్కే నగర్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే ఆమె అనుచరగణం సీఎం పీఠాన్ని అధిష్టించాల్సిందిగా శశికి బహిరంగ విజ్ఞప్తులు చేస్తున్నారు.అసలు అపోలో ఆస్పత్రిలోనే శశికి అనుకూలంగా పార్టీలో కొందరు మాట్లాడినా కేంద్రం ఆమె దూకుడుకి అడ్డుకట్ట వేసిందని విన్నాం.ఇప్పుడు మళ్లీ శశి ఎత్తుగడలు మొదలయ్యాయి.

ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే జరిగిందని …జరుగుతోందని సీఎం పన్నీర్ సెల్వం అర్ధం చేసుకున్నారు.అయన కూడా సైలెంట్ గా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.తన పట్ల సానుకూలంగా ఉన్న కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ అండతో ఈ సమస్యని అధిగమించాలని అయన ప్లాన్ చేసుకుంటున్నారు.అందులో భాగంగానే ప్రభుత్వ పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.పనిలోపనిగా రాజకీయాల్లో తన వ్యూహాన్ని చెప్పి అయన ఢిల్లీ పెద్దల అండ కోరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.మొత్తానికి జయ బతికినన్నాళ్లు ఢిల్లీ నేతలే చెన్నై వచ్చి అమ్మ దర్శనం చేసుకునేవాళ్ళు.ఆమె కాలం చేసి నెల కూడా గడవకముందే కుర్చీకుమ్ములాటతో తమిళ రాజకీయాల్ని ఢిల్లీ చేతుల్లో పెడుతున్నారు.