నేనే…తమిళ నాడు సిఎం అంటున్న నెచ్చెలి శశికళ

Posted December 9, 2016

tamilnadu cm sashikalaనెచ్చెలి శశికళ రాజకీయ చతురత చుపిస్తున్నట్టే ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో పార్టీ పగ్గాలు చేబూనేందుకు అంగీకరించిన ఆమె.. తాజాగా సీఎం పదవి కావాలనే కోరికని బైటపెట్టారు. ఈ రోజు పోయెస్‌గార్డెన్‌లో జరిగిన సమావేశంలో అదే విషయాన్నీ తన కోరికను శశి కళ బయటపెట్టినట్లు సమాచారం. ఈ కోరిక విన్న ఆమె మాట విన్న సీనియర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. శశికళ పార్టీపై తనకున్న పట్టును, తన దయతో ఎమ్మెల్యేలైన వారి సంఖ్యను గణాంకాలతో సహా వివరించడంతో అవాక్కయిన సీనియర్లు.. ఏం చెప్పాలో తెలియక మిన్నకుండిపోయినట్లు సమాచారం.

అంతే కాదు జయ మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్‌ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయనున్నట్లు కూడా శశికళ స్పష్టం చేసిందట.ముఖ్య మంత్రి పన్నీర్‌సెల్వం మాత్రం శశికళ తో విభేదించారట. ఆ విషయాన్ని రెండురోజుల ముందే చెప్పి ఉండాల్సిందని, సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేశాక మళ్లీ ఇలాంటి ఆలోచనలేంటంటూ నిలదీసినట్లు తెలిసింది. ఆర్‌కే నగర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని ఆయన కుండబద్దలు కొట్టడంతో శశికళ ఆగ్రహంతోనే మౌనం దాల్చినట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.మొత్తం గా తమిళ నాడు లో రాజకీయ సంక్షోభం అన్నా డీ ఎంకే పార్టీ లో ముసలం రావడం ఖాయం గా కనిపిస్తోంది …