జర్నలిస్ట్ ,కెమెరా మెన్ పై మంత్రి తన్వీర్ సేఠ్‌ ఫిర్యాదు

Posted November 14, 2016

tanveer sait files case against TV9 reporterచేసింది తప్పు పని సిగ్గులేకుండా ఇంకా దాన్ని కప్పి పుచ్చటం కోసం జర్నలిస్టులు పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం రాజకీయ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనం కాదా ?.

మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోయిన కర్ణాటక ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్‌ వ్యవహారంలో తెలిసిందే . ట్విస్ట్ ఏంటంటే ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్తో పాటు కెమెరామెన్పై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 504 కింద టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై కేసు నమోదుచేసారట .

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ… మొదట నివేదికను పరిశీలించాక దీనిపై విచారణ జరిపించి అనంతరం చర్య తీసుకుంటామన్నారు. అశ్లీల దృశ్యాల వీక్షణపై మంత్రితో మాట్లాడానని, తాను ఏ తప్పు చేయలేదని తన్వీర్ సేఠ్‌ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎవరు చేసినా తప్పు తప్పేనని సిద్ధరామయ్య అన్నారు.

రాయ్‌చూర్ జిల్లాలో నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా గురువారం మంత్రి తన్వీర్ సేఠ్ సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే.దీంతో తన్వీర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…. బీజేపీతో పాటు జేడీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏముంటుందని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన్వీర్ వాదన

ఈ ఘటనపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందిస్తూ… తన్వీర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మొబైల్ లో అస్లీల దృశ్యాలు చూస్తు దొరికిపోయిన మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.