తార‌క‌ర‌త్న పొలిటిక‌ల్ ఎంట్రీ

Posted December 1, 2016

Image result for taraka ratna in politics
తెలుగు రాజ‌కీయాల్లో నంద‌మూరి వంశం ముద్ర చెరిగిపోనిది. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా అశేష ప్ర‌జాభిమానాన్ని పొందారు. ఆయ‌న హయాంలోనే నంద‌మూరి వంశం నుంచి రెండోత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది. హ‌రికృష్ణ … ఎన్టీఆర్ కు చేదోడువాదోడుగా ఉంటూ పార్టీలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత బాబు హయాంలోనూ రాజ్య‌స‌భ స‌భ్యుడిగాను సేవ‌లందించారు. హ‌రికృష్ణ త‌ర్వాత ఆయ‌న త‌మ్ముడు బాల‌య్య బాబు కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సేవ‌లందిస్తున్నారు. ఇప్పుడు మూడోత‌రం వంతు వ‌చ్చింది. హీరో తార‌క‌ర‌త్న అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

హీరోగా ప‌లు సినిమాల్లో న‌టించిన తార‌క‌ర‌త్న‌… అక్క‌డ అంత‌గా రాణించ‌క‌పోవ‌డంతో ఇక రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి గుంటూరు జిల్లా అయితే సేఫ్ అని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అందులో భాగంగానే ఆయ‌న ఇటీవ‌ల గుంటూరు జిల్లాలో మకాం వేశార‌ని చెప్పుకుంటున్నారు. తెలుగు యువ‌త నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా ఉంటున్న‌ట్టు స‌మాచారం. దాదాపుగా నెల‌రోజుల నుంచి చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌రిలోకి దిగుతాన‌ని తార‌క‌ర‌త్న.. తెలుగు యువ‌త నేత‌ల‌తో చెప్పార‌ట‌. అంతేకాదు త‌న‌కు మావ‌య్య చంద్ర‌బాబు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని చెప్పుకొచ్చార‌ట‌. అయితే నిజంగానే ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా.. ఇచ్చినా అందుకు గుంటూరు జిల్లానే సేఫ్ అని భావిస్తారా… అన్న‌ది చూడాలి.