దేశం ఆరోపణలు నిజమంటున్న వైసీపీ

 tdp accused true ycp

తుని విధ్వంసం కేసుకి సంబంధించి CID విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత భూమన కరుణాకరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి ycp ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇక దాసరి ఇంట్లో జరిగిన కాపు నేతల సమావేశంలో అంబటి రాంబాబు, కన్న బాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు … ఇలా 70-80 శాతం మంది వైసీపీ నేతలే వున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలతో ముద్రగడ ఉద్యమం వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ ycp నే అని తేట తెల్లం అవుతుంది.

తుని విధ్వంసం తర్వాత ఈ విషయాన్నే అధికార తెలుగు దేశం పదే పదే చెప్పింది. ముద్రగడ ycp చెప్పినట్లు ఆడుతున్నారని దేశం నేతలు వివిధ సందర్భాల్లో ఆరోపించారు. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా మాట్లాడుతూ కరుణాకరరెడ్డి … కాపుల సానుభూతి పొందాలని చూస్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఉద్యమం పేరుచెప్పి దాని ముసుగులో జరిగిన హింసాత్మక ఘటనల్ని … అసలేం జరగనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వ్యూహాలకి దీటైన జవాబివ్వడం మరీ కష్టమేం కాదని త్వరలోనే భూమన అండ్ కో కి అర్ధమయ్యే రోజు దగ్గర్లోనే వుంది. CID సాక్ష్యాలు బయటపడ్డాక ఈ నోటి దూకుడుకు కూడా బ్రేక్ పడక తప్పదు.