భూమన మీదే దేశం డౌట్ …

Posted November 27, 2016

Image result for bhumana karunakar reddy

ఏపీ లో ఏదో రూపంలో కుల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.ఓ వైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ సెగలు తగులుతుండగానే మరో వైపు రజకులు తమని ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ముందుకు తెచ్చారు.ఇదే డిమాండ్ తో ఉద్యమ రూపకల్పనకు నడుం కట్టారు.అందులో భాగంగా రజకుల ఆత్మగౌరవ యాత్ర పేరిట సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు.తిరుపతి లోని అలిపిరి వద్ద నుంచి ఈ యాత్ర మొదలెట్టారు.అయితే వెంటనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు ఇన్నాళ్లు లేని కుల ఉద్యమాలు ఇప్పుడు ఊపందుకోవడం వెనుక ప్రతిపక్ష వైసీపీ పాత్ర ఉందని దేశం వర్గాలు అనుమానిస్తున్నాయి.పైగా వైసీపీ ముఖ్యనేత భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వ్యూహాలు రచిస్తుంటారని కూడా టీడీపీ నేతల భావన.2019 ఎన్నికల్లో లబ్ది కోసం కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారని చిత్తూర్ దేశం నాయకులు ఇప్పటికే భూమన గురించి హైకమాండ్ దగ్గర ప్రస్తావించారట.సమయం వచ్చినపుడు ఎవరి హస్తం ఉందో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా వచ్చినట్టు తెలుస్తోంది.చూద్దాం ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో?