జగన్ కి టచ్ లో ఉంటున్న దేశం నేతలు?

Posted December 12, 2016

tdp leaders close touching with jaganవైసీపీ అధినేత జగన్ దశ తిరిగినట్టుంది…నిన్నమొన్నటిదాకా ఆపరేషన్ ఆకర్ష్ తో వాడిపోయిన ఆయన మోహంలో తిరిగి చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గతవారం,పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు జగన్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.ఒకరిద్దరు కాదు పెద్ద స్థాయిలో నేతలు వైసీపీ లో చేరడానికి ముందుకు రావడం రాజకీయ వాతావరణంలో వస్తున్న మార్పులకి సంకేతంగా అయన భావిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ కి రాజీనామా చేసి మరీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.ఇక కాంగ్రెస్ నేత ,మాజీ మంత్రి కుమారుడు కాసు మహేష్,మరో కాంగ్రెస్ నేత దుర్గేష్ వైసీపీ లో చేరడం ఖాయమైంది.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేరు కూడా జగన్ పంచన చేరబోయే జాబితాలో కనిపిస్తోంది.అంతకన్నా జగన్ కి ఉత్సాహం కలిగిస్తున్న వార్త ఇంకోటుంది.కొందరు దేశం నేతలు ఆయనతో టచ్ లోకి వస్తున్నారంట.

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ లో చేరడానికి పావులు కదుపుతున్న జాబితా చిన్నదేమీ కాదు.అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పేరు …రాయలసీమకి చెందిన ఓ ఎంపీ,మరో ఎమ్మెల్సీ పేరు బలంగా వినిపిస్తున్నాయి.ఇక నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి వేధింపులు తట్టుకోలేక ముగ్గురు నేతలు మూకుమ్మడిగా జగన్ దరికి చేరే ఆలోచన చేస్తున్నారట.వీరిలో కొందరు జగన్ సన్నిహితులతో …మరికొందరు జగన్ తో టచ్ లోకి వచ్చినట్టు సమాచారం.ప్రకాశం జిల్లాకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే బెర్త్ రిజర్వు చేయించుకున్నట్టు తెలుస్తోంది.ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ కి మంచి రోజులు వచ్చినట్టే వుంది.