మోడీ దిగేవరకు అరగుండు తోనే ఉంటా..?

Posted November 28, 2016

Image result for kerala-fast-food-vendor-shaves-off-half-head

నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ లోని ఓ ఛాయ్‌ వాలా ప్రధాని మోడీ పై శపథం చేశాడు.రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ ఛాయ్‌ వాలా అర గుండు చేయంచుకున్నాడు. మోదీ దిగిపోయే వరకు అరగుండుతోనే ఉంటానని, అప్పటి వరకు వెంట్రుకలు పెంచనని ప్రతిజ్ఞ చేశాడు(ఇంతకుముందు బట్టతల) ఇప్పుడు అరగుండు.. ఏడు పదుల వయసున్న యాహియా సొంతవూరు కొల్లం జిల్లాలోని కొట్టక్కల్ ఈయనకి ఇద్దరు ఆడ పిలల్లు ఒకరికి బ్యాంకు లోనే పెట్టి పెళ్లి చేసాడు .హోటల్ పెట్టుకొని జీవిస్తున్నాడు

500, 1000 రూపాయల నోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని తెలిసి షాకయ్యాను. కష్టపడి దాచుకున్న డబ్బు 23 వేల రూపాయలు ఉంది. అన్ని పెద్ద నోట్లు. వీటిని మార్చుకునేందుకు బ్యాంకుల ముందు రెండు రోజులు క్యూలో నిల్చున్నా. నాకు బ్యాంకు ఖాతా లేదు. దీంతో పాతనోట్లను ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. ఎన్ని రోజులు బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాలి? పగలు రాత్రి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది. నా డబ్బు చెల్లకుండా పోయింది అని వాటిని కాల్చేసి వెంటనే దగ్గరలోని బార్బర్‌ షాప్‌కు వెళ్లి బట్టతలను సగం గుండు చేయించుకున్నా మోడీ దిగే వరకు ఇలానే ఉంటా అని అంటున్నాడు ..