30 సెకన్ల టీజర్ తో సీన్ మార్చేశాడుగా..!!

Posted February 6, 2017

teaser reversed the movie sceenకాటమరాయుడు టీజర్ వస్తోందని ఎప్పటినుండో అభిమానులను  ఊరించిన చిత్ర దర్శకుడు డాలి, నిర్మాత శరత్ మరార్ ఎట్టకేలకు శనివారం టీజర్ ని రిలీజ్ చేశారు. 30 సెకన్లు ఉన్న ఆ టీజర్ తో ఒక్కసారిగా సీన్ ని మార్చేశాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే టీజర్ రిలీజయ్యేవరకు సినిమాకు హైప్ వచ్చేవిధంగా దర్శకనిర్మాతలు ఒక్క పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు.

ఇది రీమేక్ అవ్వడంతో ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ వర్షన్ రావడం , నార్మల్ ఆర్టిస్టులను పవన్ తమ్ముళ్లుగా, హీరోయిన్ గా శృతిని  సెలెక్ట్ చేయడం వంటి వాటితో  సినిమాకు అంతగా క్రేజ్ తీసుకురాలేకపోయారు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ యావరేజ్ అవడంతో ఈ సినిమాపై దాని ప్రభావం ఉండడంతో ఇప్పటివరకు ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు ముందుకు రాలేదని సమాచారం. అయితే మొన్న రిలీజైన కాటమరాయుడు టీజర్ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

ఇప్పటివరకూ బిజినెస్ విషయంలో  బేరాలాడిన బయ్యర్లు ఇప్పుటు ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తూ నిర్మాత శరత్ మరార్ వెనకపడ్డారు. ఇక  కొన్ని ఏరియాల్లో అయితే  కాటమరాయుడు… మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150ని మించి బిజినెస్ చేసిందని టాక్. టీజర్ రిటీజైన రెండు గంటలలోపే 1 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన కాటమరాయుడు… ఇక ఉగాది తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.