అమ్మ మ‌ర‌ణాన్ని ముందే ఊహించిన తెహ‌ల్కా!!!

Posted December 11, 2016

tehalka know about amma death
జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ గురించి 2012 లో ప్ర‌ముఖ ప‌త్రిక తెహ‌ల్కా సంచ‌న‌ల విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. జ‌య హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని…ఆ కుట్ర‌కు సూత్ర‌ధారి శ‌శిక‌ళేన‌ని ఆ క‌థ‌నం సారాంశం. అంతేకాదు ఆ క‌థ‌నంలో మ‌న్నార్గుడి మాఫియా గురించి కూడా ప్ర‌స్తావ‌న ఉంది. జ‌య‌ను దించి… శ‌శిక‌ళ‌ను సీఎంను చేయ‌డానికి మ‌న్నార్గుడి ప్ర‌య‌త్నాలు చేసింద‌ట‌. అయితే అప్ప‌టికే శ‌శిక‌ళ అక్క‌డ్నుంచే వెళ్లిపోవ‌డంతో ఈ విష‌యాలకు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

జ‌య అండ లేకుండా శ‌శిక‌ళ ఉండ‌డం క‌ష్ట‌మే కాబ‌ట్టి… ఎలా మ్యానేజ్ చేశారో కానీ శ‌శిక‌ళ మ‌ళ్లీ అమ్మ పంచ‌న‌ చేరిపోయారు. అనుకున్న‌ట్టుగానే జ‌య వెన‌క ఉండి చ‌క్రం తిప్పారు. అయితే అమ్మ అకాల మ‌ర‌ణం చెంద‌డంతో ఇప్పుడు శ‌శిపై అనుమానించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముందు అమ్మ‌ మృతి వెన‌క పెద్ద క‌థే న‌డిచింద‌ని జ‌య మేన‌కోడ‌లు అనుమానం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత అన్నాడీఎంకే బ‌హిష్క‌త ఎంపీ కూడా ఇదే విష‌యం చెప్పారు. జ‌య‌ల‌లిత ట్రీట్ మెంట్ గురించి అన్ని విషయాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. తాజాగా గౌతమి కూడా అన్ని విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వాల‌ని ఏకంగా ప్ర‌ధాని మోడీకే లేఖ రాశారు. ఈ అనుమానాల‌ను బ‌ట్టి చూస్తే నిప్పు లేనిదే పొగ రాద‌నే సామెత గుర్తుకు వ‌స్తోంది. అంతేకాదు అమ్మ హ‌త్య‌కు గ‌తంలోనే కుట్ర జ‌రిగింద‌న్న వార్త‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం స‌మ‌యంలో శశికళే ఆస్ప‌త్రిలో ఉండ‌డం… అమ్మ ద‌గ్గ‌ర‌కు ఎవ‌రినీ అనుమ‌తించ‌క‌పోవ‌డం లాంటి విష‌యాల‌న్నీ ఇప్పుడు చాలా పెద్ద‌విగా క‌నిపిస్తున్నాయి. రోజుకో క‌థ‌నం వెలుగులోకి వ‌స్తుండ‌డంతో అంద‌రూ ఇప్పుడు శ‌శిక‌ళ‌వైపే చూస్తున్నారు. తెహ‌ల్కాలో ప్ర‌చురించిన‌ట్టుగానే శ‌శి ఏదో చేసి ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు జ‌య బ‌తికున్న‌ప్పుడు దూరంగా ఉన్న మన్నార్గుడి మాఫియా ఇప్పుడు శ‌శిక‌ళ‌కు తోడుగా ఉండ‌డం క‌చ్చితంగా అనుమానించాల్సిన విష‌య‌మేనంటున్నారు జ‌య అభిమానులు.