తెలంగాణ బాహుబలి ఎవరో తెలిసిపోయింది

0
115

Posted April 28, 2017 at 10:19

telangana baahubali revealedఎన్నికల నాటికి మాకు బాహుబలి వస్తాడు. ఇదీ సీఎల్పీ నేత జానారెడ్డి మొదలుపెట్టిన డైలాగ్. అప్పట్నుంచీ తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ కు చాలా మంది బాహుబలులు ఉన్నారని సీనియర్ నేతలంటే.. టీడీపీకి ప్రతి కార్యకర్త బాహుబలే అన్న రేంజ్ లో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ హరీష్ ను దృష్టిలో పెట్టుకునే బాహుబలి టాపిక్ తెచ్చిందని డిసైడయ్యారు. ఇక ఇప్పుడు అధికార పార్టీ వంతు. అందరూ ఊహించినట్లే కేసీఆర్ తమ బాహుబలి అని చెప్పేశారు డిప్యూటీ సీఎం కడియం.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నేతన్నలకు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ ఇలా కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల లిస్ట్ చాంతాడంత ఉందన్నారు. అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ బాహుబలి అని చెప్పేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు ఇతర నేతలు ఆలోచన కూడా చేయలేరన్నారు. కానీ కడియం వ్యాఖ్యలతో తెలంగాణలో పొలిటికల్ హీటు బాగా రాజుకుంది. నిజంగా కేసీఆర్ ను బాహుబలి అనేంత సీన్ లేదంటున్నారు విమర్శకులు.

ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని, ఇక అమరవీరు కుటుంబాలకు తీరని ద్రోహం చేశారని, దళితుల్ని సీఎం చేస్తానన్న హామీతో పాటు మూడెకరాల భూమి కూడా హుళక్కయిందని విమర్శలు వస్తున్నాయి. ఎవరేమనుకున్నా గులాబీ పార్టీకి కేసీఆర్ బాహుబలి అనడంలో కొంత నిజముంది. ఎందుకంటే కేసీఆర్ అనే పేరు ఉన్నంతవరకే.. పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా ఉంటాయి. ఒక్కసారి కేసీఆర్ సైడైపోతే.. అప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ మధ్య బాహుబలి ట్యాగ్ కోసం పోటీ తప్పదుగా.