కాంగ్రెస్,దేశం ఒకే మాట .

 telangana congress tdp same wordరాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. ఇప్పుడు ఈ మాట‌ను నిజం చేసేందుకు సిద్ధ అవుతున్నాయి తెలంగాణ‌లోని కాంగ్రెస్‌, టీడీపీలు! రాజ‌కీయాల ప‌రంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తేనే భ‌గ్గుమ‌నే ఈ రెండు పార్టీలు క‌ల‌వ‌డ‌మా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. అందుకే భ‌విష్య‌త్తులో ఏక‌మై.. అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం చంద్ర‌బాబుపై పోరు సాగించేందుకు సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం…తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న 10 జిల్లాల‌ను మ‌రింత‌గా పెంచి 27 జిల్లాలు చేయాల‌ని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ముందు దీనికి అంద‌రూ సై అన్నారు.

అయితే, జిల్లాల పెంపులో కేసీఆర్ వ్యూహం ఏంట‌నేది త‌ర్వాత కానీ ఇత‌ర పార్టీల నేత‌ల‌కు అర్ధం కాలేదంట‌. ఇప్పుడ‌ది తెలుసుకుని ల‌బోదిబో మంటున్నారు. జిల్లాల పెంపు పేరుతో కాంగ్రెస్‌, టీడీపీల్లో బ‌లంగా ఉన్న నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌ను విడ‌దీసి రెండు మూడు జిల్లాల‌ను చేస్తున్నారు. దీంతో త‌మ ప్ర‌భావం త‌గ్గిపోతుంద‌ని, ఇప్ప‌టికి త‌మ నియోజ‌క‌వ‌ర్గం ఒక జిల్లాలో ఉంటేనే ప‌నులు అవ‌క నానా తిప్ప‌లు ప‌డుతుంటే.. ఇక రెండు మూడు జిల్లాల్లో ఉంటే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని విప‌క్ష ఎమ్మెల్యేల‌కు దిగులు ప‌ట్టుకుంది.

అస‌లు ఇదంతా కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ అని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విప‌క్ష ఎమ్మెల్యేల‌ను, నేత‌ల‌ను అడ్ర‌స్ లేకుండా చేయ‌డానికే ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జిల్లాల ఏర్పాటును తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని టీడీపీ కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ తాము ఆందోళ‌న‌కు దిగుతామ‌న్నారు. ఇక‌, ఇదే విష‌యంపై కాంగ్రెస్ కూడా కేసీఆర్‌పైకాలు దువ్వుతోంది. జిల్లాల ఏర్పాటు కేసీఆర్ ఇష్టానుసారం జ‌రుగుతున్నాయ‌ని, ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌ర‌గ‌డం లేద‌ని కాంగ్రెస్ తెలంగాణ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఇక‌, గ‌ద్వేల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలా విప‌క్షాల‌న్నీ ఒకే అంశంపై పోరాటానికి దిగాయి. దీంతో రానున్న కాలంలో ఈ రెండు పార్టీలు కేసీఆర్‌పై ఉమ్మ‌డి యుద్ధానికి సిద్ధ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయంటున్నారు విశ్లేష‌కులు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన పాలేరు ఉప ఎన్నిక‌ను పేర్కొంటున్నారు. ఇక్క‌డి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆయన భార్య సుచ‌రితా రెడ్డిని ఏక‌గ్రీవంగా గెలిపించేందుకు కాంగ్రెస్‌తో టీడీపీ క‌లిసి వ‌చ్చింది. అలాగే.. ఇప్పుడు కేసీఆర్‌పై యుద్ధానికి ఇరు పార్టీలు చేతులు క‌లుపుతాయ‌ని భావించ‌వ‌చ్చ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు