‘బాహుబలి’ థియేటర్లకు తెలంగాణ సర్కార్‌ వార్నింగ్‌

0
39

Posted April 27, 2017 at 13:23

telangana govt warning to bahubali theaters staff
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా నేటితో ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను నేటి సాయంత్రం షోతో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ దృష్ట్యా భారీ మొత్తంలో బ్లాక్‌ టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యం భావిస్తుంది. ఉన్న రేటుకు డబుల్‌ వసూళ్లు చేయాలని, సినిమాపై మోజుతో తప్పకుండా ప్రేక్షకుడు టికెట్‌ను కొట్టాడనే నమ్మకంతో వారు ఉన్నారు. ఇప్పటికే టికెట్‌ రేటు పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పినా కూడా అంతకు మించి వసూళ్లు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వారు టికెట్ల రేట్లను భారీగా పెంచి అమ్మేందుకు సిద్దం అవుతున్నారు.

హైదరాబాద్‌లో పలు ఏరియాల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇస్తున్న టికెట్ల రేట్లు నిర్ణయించిన ధర కంటే అధికంగా పెట్టి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కమర్షియల్‌ ట్యాక్స్‌ కమీషనర్‌ స్పందించారు. రాష్ట్రంలోని ఏ థియేటర్‌లో అయినా నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర చేసి టికెట్లు అమ్మినట్లయితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. థియేటర్లలో ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నా లేక బ్లాక్‌ టికెట్లు అమ్ముతున్నా కూడా 1800 4253 787 నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు.