తెలంగాణ కొత్త సి ఎస్ డమ్మీ ..?

Posted December 1, 2016

Image result for kcr and cs rajiv sharma

సచివాలయంలోని కేసీఆర్ బ్లాక్ లోనే సి ఎస్ రాజీవ్ శర్మ కు ఆయనకుఛాంబర్ కేటాయించడం చకచకా జరిగిపోయాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాజీవ్ శర్మ ఆయనకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అయితే రాజీవ్ శర్మ కొత్త బాధ్యతలు తీసుకోవడం వల్ల కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర డమ్మీ అవుతారేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీఎస్ గా రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరికొంతకాలం పొడిగించాలని కేంద్రాన్ని అడుగుదామని మరో మూడు నెలలకైనా కొత్త సీఎస్ వస్తారనే ఉద్దేశంతో ఈ విషయంపై దృష్టి సారించలేదట. అయితే కొత్త సీఎస్ ఉన్నా కీలకమైన అంశాలకు సంబంధించి రాజీవ్ శర్మ సలహాలను తీసుకుని…ఆయనను కొత్త సీఎస్ కు అనుబంధంగా ఉండేలా ఏర్పాటు చేయాలని కేసీఆర్ రాజీవ్ శర్మ కు ఆయనకు చీఫ్ అడ్వైజర్ పోస్టును ఇచ్చినట్టు తెలుస్తోంది.కొత్త సి ఎస్ ప్రదీప్ చంద్ర, రాజీవ్ శర్మ డామినేషన్ కెసిఆర్ తో సత్సంబంధాల వల్ల డమ్మీ గా అవుతారని అనుకొంటున్నారు