కొన్ని శాఖల ఖజానా మాత్రమే నింపిన నోట్ల రద్దు …

Posted November 25, 2016

telangana rtc profit loss because of 500 1000 rs notes bannedనల్ల కుబేరుల భరతం పట్టడం సంగతి అటుంచితే ..రద్దు పుణ్యమా అని మొండి బాకీ లు అన్ని వసూలయ్యాయి కొన్ని ప్రభుత్వ శాఖలకు, హైదరాబాద్ లో జీ హెచ్ ఏం సి లాంటి వాటికీ ఐతే పండగ..కానీ రవాణా సంస్థ కి నష్టం వచ్చింది .నోట్ల రద్దు తరువాత పాత నోట్లతో పన్ను బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది ఆర్థికంగా కుదేలైన జీహెచ్‌ఎంసీకి ఈ నిర్ణయం కొత్త వూపిరి పోసింది. రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చనడంతో నగరంలోని వేలాది మంది పాత బకాయిలతోపాటు వచ్చే ఏడాది (అడ్వాన్స్‌డ్‌) పన్ను కూడా చెల్లించారు. గురువారం సాయంత్రానికి రూ.234 కోట్లు వసూలైంది. నిరుడు ఇదే సమయానికి వసూలైన మొత్తం రూ.40 కోట్లు మాత్రమే. జలమండలికి ఉన్న రూ.300 కోట్ల బకాయిల్లో ఈ 15 రోజుల్లోనే సుమారు రూ.100 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్తు సంస్థ కూడా రద్దైన నోట్లతో కొత్త బిల్లులు, బకాయిలు చెల్లించవచ్చంది. దీంతో ఇప్పటి వరకు రూ.600 కోట్ల బిలులు వసూలయ్యాయి. గతేడాది ఇదే సమయానికి వసూలైన మొత్తం కంటే ఇది రూ.150 కోట్లు ఎక్కువ.

ఆర్టీసీకి రోజువారీ రాబడి పోనూ రూ.90 లక్షల నష్టం వస్తోంది హైదరాబాద్ పరిధిలో . దీనికితోడు పెద్ద నోట్ల రద్దు తరువాత మొదటి వారం రోజులు ఆర్టీసీకి రోజూ రూ.40 లక్షల రాబడి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా రూ.30 లక్షలు తక్కువగానే వస్తోందని అధికారులు చెబుతున్నారు. మొతం గా నోట్ల రద్దు కొన్ని శాఖలో కల నింపినా కొన్ని ఏరియా ల్లో మాత్రం నష్టం కలిగించింది …