10 నుంచి 27 …టీలో కొత్త జిల్లాలు

0
222

 telangana state new districts 10-27తెలంగాణలో కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్… 27జిల్లాలకు మొగ్గుచూపారు. కొత్తగా మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, హన్మకొండ, భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, వికారాబాద్, శంషాబాద్, మల్కాజిగిరి జిల్లాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

అలాగే రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 74కు పెంచడంతో పాటు, మండలలాలను 533కు పెంచాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సీఎంకు రిపోర్ట్ సమర్పించింది. ఉన్నతస్థాయి సమావేశంలో మహమూద్ అలీతో పాటు, విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు 6గంటల పాటు చర్చించారు. ఈ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నెల రోజుల వ్యవధి ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాఉండగా కొత్త జిల్లాల జాబితాలో గద్వాల, జనగామ, సిరిసిల్లలకు చోటు దక్కలేదు.

1 ఆదిలాబాద్
2 మంచిర్యాల
3 నిర్మల్
4 కరీంనగర్
5 పెద్దపల్లి
6 జగిత్యాల
7 వరంగల్
8 మహబూబాబాద్
9 హన్మకొండ
10 భూపాలపల్లి
11 మెదక్
12 సిద్దిపేట
13 సంగారెడ్డి
14 నిజామాబాద్
15 కామారెడ్డి
16 నల్లగొండ
17 సూర్యాపేట
18 యాదగిరి
19 మహబూబ్‌నగర్
20 నాగర్‌కర్నూల్
21 వనపర్తి
22 ఖమ్మం
23 కొత్తగూడెం
24 హైదరాబాద్
25 వికారాబాద్
26 శంషాబాద్