తెలుగు రాష్ట్రాల్లో పైన పటారం.. లోన లొటారం.

Posted December 18, 2016

telugu cms about demonitizationనోట్ల రద్దును రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. ఆశ్చర్యకరంగా చంద్రబాబు కంటే కేసీఆర్ ఎక్కువగా ఈ నిర్ణయం గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అటు బాబు గారు కూడా లోపల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బయటకు సానుకూల ప్రకటనలు చేస్తున్నారు.

కేసీఆర్, చంద్రబాబు అభిప్రాయం పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో పైన పటారం .. లోన లొటారం అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అటు కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులు గానీ.. ఇటు ఏపీ మినిస్టర్లు గానీ ..సీఎంల అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. ఈ అసంతృప్తిని రెండు రాష్ట్రాల మంత్రులు బహిరంగంగానే వెళ్లగక్కారు. నోట్ల రద్దుతో జనమంతా ఆగమయ్యారని మోడీ నిర్ణయాన్ని గట్టిగా ప్రశ్నించారు కూడా.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జనమంతా డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వ్యాపారాలన్నీ దివాళా తీశాయి. రెండురాష్ట్రాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మరీ ఇంతగా మోడీకి జై కొడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాని నిర్ణయం మంచిదే కావచ్చు.. కానీ ప్రస్తుతం మాత్రం జనం ఇబ్బందులు పడుతున్నారుగా!!