తెలుగు రాష్ట్రాల్లో కొత్త స్థానాలు లేవు..

  telugu states no new assembly seats

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచే అవ‌కాశం లేద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి హ‌న్స్ రాజ్ గంగారాం రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు. అంత‌కుముందు తెలంగాణ‌, ఏపీల‌లో విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ తెలంగాణ ఎంపీలు వినోద్‌కుమార్‌, బీబీ పాటిల్‌, సీతారామ్‌నాయ‌క్‌లు మంత్రిని క‌లిశారు.

శాస‌న‌స‌భ స్థానాల పెంపున‌కు ఆర్టిక‌ల్ 170 అడ్డుగా ఉంద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు క‌రీంన‌గ‌ర్ ఎంపీ వినోద్‌కుమార్‌. సుప్రీంకోర్టు కు విభజన సమస్యలు వచ్చినప్పుడు ఆర్టికల్ 3,4 కింద విభజన చట్టం రూపొందించబడింది కాబట్టి రాజ్యాంగ సవరణ 368 కింద జరగాల్సిన అవసరం ఉండదు అని చెప్పడం జరిగిందని వినోద్ గుర్తుచేశారు.