తెలంగాణ చాడీరాయుళ్ల‌కు టెన్ జ‌న్ ప‌థ్ క‌ళ్లెం..

Posted November 24, 2016

ten jhan padh stops the telangana royals
ఏఐసీసీ అంటేనే లాబీయింగ్ లు… రెక‌మండేష‌న్లకు పెట్టింది పేరు. అక్క‌డ హైక‌మాండ్ కు భ‌జ‌న‌చేసే వారిదే న‌డుస్తుంద‌ని కొత్త‌గా చెప్పేదేం లేదు. కానీ ఇప్పుడా ప‌రిస్థితిలో మార్పుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సోనియా- రాహుల్ వైఖ‌రిలో ఛేంజ్ వ‌చ్చింద‌ట‌. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. తెలంగాణ ఇచ్చేస్తే ప్ర‌త్యేక‌రాష్ట్రంలో కాంగ్రెస్ హ‌వా న‌డుస్తుంది.. ఇక హ‌స్తానికి తిరుగుండదు. టీఆర్ఎస్ కు నో మైలేజ్ అని నోటికొచ్చిన‌వి చెప్పార‌ట తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. అందులో ఎక్కువ మంది భ‌జ‌న‌ప‌రులే ఉండ‌డంతో ఆ భ‌జ‌న‌లో మునిగిపోయి.. అదే నిజ‌మ‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ నమ్మింది. ఎన్నిక‌ల్లోనూ వారి చెప్పిన‌ట్టే చేసింది. తీరా ఫ‌లితాల‌కొచ్చేస‌రికి అంతా త‌లకిందులైంది. టీఆర్ఎస్ అధికారాన్ని చేప‌డితే.. కాంగ్రెస్ మాత్రం బొక్కబొర్లా ప‌డింది. అందుకే ఇక ఈ చాడీరాయుళ్ల మాట వినొద్ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట కాంగ్రెస్ పెద్ద‌లు.

ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ విష‌యంలోనూ కొంత‌మంది సీనియ‌ర్లుగా చెప్పుకునే నాయ‌కులు… కంప్ల‌యింట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. కానీ అలాంటి వారికి ఇప్పుడు నో ఎంట్రీ బోర్డు ద‌ర్శ‌న‌మిస్తోంది. ఇప్ప‌టిదాకా చేసిన న‌ష్టం చాలు.. ఇక ద‌య‌చేయండి అని ముఖంమీదే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారంట ఏఐసీసీ నేత‌లు. ఏం చేసినా ఉత్త‌మ్ మాట వినాల్సిందేన‌ని గ‌ట్టిగానే మందలించి పంపించేస్తున్నార‌ట‌. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇంటిదారి ప‌డుతున్నారు తెలంగాణ నేత‌లు. అదే స‌మ‌యంలో ఉత్త‌మ్ లోనూ టెన్ష‌న్ మొద‌లైందని స‌మాచారం. ప్ర‌స్తుతానికి త‌న మాటే చెల్లుబాటు అవుతున్నా కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేరు. ఒక‌వేళ తాను కూడా హైక‌మాండ్ అంచ‌నాలను అందుకోలేక పోతే త‌నను కూడా లైట్ తీసుకునే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌.