పవనాయణంలో దేశం ఎంపీ,ఎమ్మెల్యే పిడకల వేట ..

0
187

 tg venkatesh bonda uma maheswara rao words fight because of pawan kalyan speech
పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి.అయితే అధికార తెలుగుదేశం లోనే ఓ mla ,ఎంపీ ల మధ్య అగ్గి రాజుకోవడం విశేషం.పవన్ సభ తర్వాత దూకుడు వ్యాఖ్యలకి పెట్టిందిపేరైన ఎంపీ టీజీ వెంకటేష్ పవర్ స్టార్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.సీఎం ,ఎంపీ లని తమిళనాట ఇలా తిడితే జయ కాళ్ళు విరగ్గొట్టి జైల్లో పెట్టించేవారని టీజీ అన్నారు .ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అభ్యంతరం వ్యక్తం చేశారు.సరిగ్గా మాట్లాడాలని టీజీ కి హితబోధ చేస్తూ….అయన కాంగ్రెస్ నుంచి వచ్చారని ఉమా గుర్తు చేశారు.

దీనిపై టీజీ మళ్లీ కౌంటర్ ఇచ్చారు.వివిధ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లేనని అయన గుర్తు చేశారు.ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన వ్యక్తినని టీజీ చెప్పుకున్నారు .పైగా చంద్రబాబు పిలిస్తేనే మళ్లీ టీడీపీలోకి వచ్చినట్టు టీజీ వివరించారు. ఇదంతా చేస్తున్నవాళ్లు ..ముఖ్యంగా టీడీపీ అభిమానులు అసలు కన్నా వీళ్ళ కొసరు గొడవ ఎక్కువైందని గొణుక్కుంటున్నారు.మరికొందరు పవనాయణంలో వీళ్లది పిడకలవేట గా అభివర్ణిస్తున్నారు .