500 కోట్లు కొట్టేసింది ips కొడుకా ?

 Posted October 17, 2016

thane call center scandal manager shaggy thakkar 
అమెరికాలో పన్ను ఎగవేస్తున్న వారిని ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న థానే కాల్ సెంటర్ కుంభకోణం సూత్రధారి గురించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.అతని పేరు శాగర్ ఠక్కర్..అలియాస్ షాజీ.నిండా 25 ఏళ్ళు నిండని ఈ కుర్రోడు అమెరికాని టార్గెట్ చేసి అతి తక్కువ టైం లో 500 కోట్లు పైగా నొక్కేసాడు.దాదాపు 700 మంది అమాయకుల్ని కేసుల పాలు చేసాడు.

2009 నుంచి మహారాష్ట్ర ,గుజరాత్ కేంద్రాలుగా ఈ కాల్ సెంటర్ కుంభకోణం సాగుతోంది.అమెరికాలో సరిగా పన్ను చెల్లించని వారి ఫోన్ నంబర్లు సంపాదించే ఈ ముఠా దాని ఆధారంగా ఆపరేషన్ చేసేది.కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మరీ అమెరికన్లని టాక్స్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు.వారికి తాము అమెరికా ఐటీ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పేవాళ్ళు.ఈ దందా 7 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.కొందరు మోసపోయిన అమెరికన్లు ఫిర్యాదుతో డొంకంతా కదిలింది.ఈ ముఠా థానే తో పాటు అహ్మదాబాద్ లో కూడా కాల్ సెంటర్ నడిపింది.అక్కడి ఓ ips అధికారి కొడుకు ఈ ముఠా సూత్రధారిని పోలీసులు అనుమానిస్తున్నారు.పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.ఇతని వల్ల కాల్ సెంటర్ లో పనిచేసిన 700 మంది కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.