ములాయం చెప్తే సర్జికల్ దాడులు జరిగాయా?

Posted November 5, 2016

the-idea-of-surgical-strikes-by-mulayam-singh
ఒక్కసారిగా మోడీ సర్కార్ ప్రతిష్ట పెంచిన సర్జికల్ స్ట్రైక్స్ సలహా ఎవరిదో తెలుసా? అజిత్ దోవల్ సలహా అని చెప్పబోతున్నారా? కానీ కాదంట …ఆ సలహా ఇచ్చింది మాజీ రక్షణ మంత్రి ములాయం సింగ్ అంట.రాజకీయ ప్రత్యర్థికి ఉపయోగపడే సలహా ములాయం ఎందుకిస్తారా…అన్న డౌట్ వస్తోంది కదా ..అదంతా యూపీ అసెంబ్లీ ఎన్నికల మహిమ.ఎన్నికల వేడి పెరుగుతున్న యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అంతర్గత కలహాలతో వెనక పడింది.బీజేపీ క్షేత్ర స్థాయిలో బలం పెంచుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్స్ వల్లే ఆ పార్టీ బలం పుంజుకుందని ఓ సమాజ్ వాదీ నేత భావించాడు.అయన పేరు మహమ్మద్ షంషేర్ మాలిక్.ఆ క్రెడిట్ లో సమాజ్ వాదీ పార్టీకి భాగం దక్కేలా ప్లాన్ వేశాడు.
రాత్రికి రాత్రే యూపీ లోని ముజఫర్ నగర్ లో పోస్టర్లు వెలిశాయి.అందులో సారాంశం ఏంటంటే …పాక్ ని ఎదుర్కోవడం పై మోడీ మాజీ రక్షణ మంత్రి ములాయం సలహా తీసుకున్నాడు.అయన చెప్పాకే సర్జికల్ దాడులు చేశారు.అది సైనికుల ఘనత తప్ప ఇంకోరిది కాదు.తెల్లవారాక ఈ పోస్టర్స్ సంచలనం అయ్యాయి.దీంతో సమాజ్ వాదీ నేతలు ఎక్కడికెళ్లినా ప్రెస్ ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇది నిజమేనా అని అడగడం …వారు ఔననీ కాదని చెప్పలేక నానా అగచాట్లు పడడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.ఓట్ల యావలో ఏదిపడితే అది చెప్పేస్తే తర్వాత ఇలాంటి పరిణామాలు తప్పవు.