పసిడి కి మకిలి

Posted November 20, 2016

po04_bullion_gold__2680712g

 

 

 

మోడీ దెబ్బకు పసిడికి మకిలి పట్టింది ఫలితం గా పసిడి ధర పతనమైంది. గత నాలుగు రోజుల్లో గ్రాముకు రూ.250 పతనమైంది.. దీంతో పదిగ్రాములు మేలిమి బంగారం రూ.29 ,500 వెండి ధర కూడా ఇదే బాట పట్టింది.. కేజీకి రూ.2,500 తగ్గింది. దీంతో శనివారం కేజీ వెండి రూ.42,500 పలికింది. వ్యాపారులు పాత నోట్లను తీసుకోకపోవడంతో డిమాండ్‌ ఒక్కసారిగా పడిపోయింది. కొత్త నోట్లు, చెక్కులు, డెబిట్‌కార్డుల కొనుగోలు కూడా పెద్దగా లేకపోవడంతో డిమాండ్‌ తగ్గిపోయింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన అయినప్పటికీ చేతిలో కొత్త నోట్లు లేకపోవడమే కారణం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గి ధర పతనానికి కారణమైంది. అలాగే మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం రూ.26వేలకు చేరువ కా వచ్చని బులియన వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం జ్యూయలరీ దుకాణాలు వెలవెలబోతున్నాయి.