చిన్నారి పెళ్ళికూతురికి ఆ మెసేజ్ లా ..!

Posted November 22, 2016

tollywood hero sends inappropriate messages to avika gorచిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గౌర్( ఆనంది) కి మెసేజ్ లు పంపి వేదిస్తున్నారట ఎవరో అశ్లీల పదాలతో కూడిన అసభ్య సందేశాలను పంపుతున్నాడట. తొలుత ఆ మెసేజ్‌లు పంపేది ఎవరో తెలియదట అవికకు. తీరా ఓ లుక్ వేస్తే ఎవరో తెలిసింది ఎవరంటే ..ఆమెకు వాట్సాప్‌లో ఆ యంగ్ హీరో.. హీరో అని తెలుసుకుని ఆమె షాక్ అయిందట.

ఆ విషయాన్ని నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బపటేల్ వంటి తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుందట. ఈ ఘటనతో తెలుగు సినిమాల్లో నటించాలంటేనే విరక్తి కలుగుతోందని వారి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట. ఇక్కడి యువ హీరోలు తమ తోటి హీరోయిన్లతో ప్రవర్తించే తీరు ఏ మాత్రం బాగుండడం లేదని అందట. ఇక, తనకు వచ్చిన అసభ్య మెసేజ్‌లన్నింటినీ తన వాట్సాప్ నుంచి తీసేసిందట. మరి, తనకు మెసేజ్‌లు పంపుతున్న ఆ యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతం అన్వేషిస్తున్నారట. గతం లో కూడా ఎలాంటి బాధ లు పడిన హీరోయిన్ లు వున్నారు అమ్మడు ..