ఘోర రైల్ ప్రమాదం 90మంది మృతి

Posted November 20, 2016

 

patna indore train accident

ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 90 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 65మంది మృతిచెందగా, 100కు పైగా ప్రయాణికులు గాయపడ్డారు .

పక్కకు ఒరిగిన బోగీలు ఇవే: GS, A1, B1, B2, B3, BE, S1, S2, S3, S4, S5, S6, లగేజ్ ర్యాక్
హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072.
రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు